ఉత్తర్ ప్రదేశ్ బరేలీకి చెందిన ఓ జంట మత మార్పిడికి పాల్పడ్డారు. వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం ఓ ఆశ్రమంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు బలవంతపు మత మార్పిడిపై వీరిద్దరూ పోలీస్ స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
హిందూ, ముస్లిం భాయి భాయి అన్న మాటకు అర్థం చేకూరుస్తూ ఓ ముస్లిం అమ్మాయి, ఓ హిందూ అబ్బాయి హిందూ దేవాలయంలో పెళ్లి చేసుకున్న ఘటన ఆసక్తిరేపుతోంది. వారిద్దరూ రెండేళ్లగా ప్రేమించుకున్నారు. అంతటితో ఆగకుండా పెళ్లి చేసుకునే వరకు వచ్చింది. ఇంకేముంది ఇద్దరు ఓకే అనుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. రూబియా అనే మహిళ.. ఓ హిందూ అబ్బాయితో పరిణయమాడింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆ జంట ఏడు అడుగులు వేసి ఒక్కటయ్యారు.