HimKavach: తీవ్రమైన చలి పరిస్థితుల్లో పనిచేసే సైనికులను రక్షించడానికి డీఆర్‌డీవో (DRDO) 'హిమ్‌కవచ్' దుస్తుల వ్యవస్థను అభివృద్ధి చేసింది. 20 సెల్సియస్ డిగ్రీల నుంచి -60 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలలో పనిచేయడానికి రూపొందించిన ఈ మల్టీలేయర్ వ్యవస్థ కలిగిన దుస్తులు వినియోగించేందుకు ఇప్పుడు అన్ని వినియోగదారు ట్రయల్స్‌ని క్లియర్ చేసింది.