Road Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. మోటర్ సైకిల్ ను కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా వుండటంతో.. అతనిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు.
Read also: Gold Price: బంగారం కొనాలంటే ఇదే కరెక్ట్ టైం.. లేట్ అయితే కొనలేరు
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మితిమీరిన వేగంతో దూకుసు వచ్చి మోటర్ సైకిల్ ను కారు ఢీ కొట్టింది దీంతో ఒకరు అక్కడికక్కడే మరణించాడు. స్థానిక సమాచారంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు. స్పాట్ లో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి కాప్స్ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరోకరు మృతిచెందాడని అన్నారు. ఇద్దరు మృతులు జార్ఖండ్ కు చెందిన జితేందర్ కుమార్, కేదేశ్వరీ గౌడ్ గా గుర్తించామని అన్నారు. రాజేంద్రనగర్ లో ఇద్దరు సెక్యూరిటీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు. హిమాయత్ సాగర్ సర్కిల్ వద్ద యూటర్న్ చేస్తుండా వెనుకాల నుండి మోటర్ సైకిల్ ను గుర్తు తెలియని కారు ఢీ కొట్డింది. మోటర్ సైకిల్ ను ఢీ కొట్టిన కారు డ్రైవర్ బైక్ పై వస్తున్న వ్యక్తి మృతి చెందడంతో కారు డ్రైవర్ పరారయ్యాడు. సి. సి ఫూటేజ్ ద్వారా కాప్స్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు వివరాలు స్వేకరిస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు. ఓవర్ స్పీడ్ వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు వివరాలు తెలిపామని అన్నారు. పది నిముషాల్లో ఇంటికి చేరుకునే క్రమంలో రోడ్డు ప్రమాదం రూపంలో కానరాని లోకాలను వెళ్లి పోయారని కుటుంబసభ్యులు బోరున విలపించారు.
Sonali Phogat Case: సోనాలీ ఫోగాట్ హత్యకు రూ.10కోట్ల డీల్?