హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రుతుపవనాలు వర్షాన్నే కాదు విపత్తును కూడా తెచ్చిపెట్టాయి. వర్షం కారణంగా ఇప్పటి వరకు 381 మంది వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. వివిధ సంఘటనలలో 360 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో ఇంకా 38 మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.8642.83 కోట్ల నష్టం వాటిల్లింది.