వర్షాకాలం ప్రారంభమవగానే కూరగాయల రేట్లకు అమాంతం రెక్కలు వచ్చాయి. గత వారం రోజుల్లోనే టొమాటోలతో సహా పలు కూరగాయలు ధరలు పెరిగాయి. అంతేకాకుండా పప్పుల ధరలు నింగికంటాయి. మరోవైపు కందిపప్పు ధరలు భారీగా పెరగడంతో.. జనాలు వాటిని తినడమే మానేశారు. ఇప్పుడు కందిపప్పు ధర ఆకాశానికి చేరుకున్నాయి.
Fixed Deposit: ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB) రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును పెంచిన తర్వాత, దేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ల వడ్డీ రేట్లను పెంచాయి.
Trisha Hikes Remuneration:వర్షం సినిమాతో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది త్రిష. సౌత్ ఇండియాలోని దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది.
ఆర్టీసీ ఛార్జీలను 60 శాతం పెంచిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) వద్ద బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఈ సందర్భంగా.. బండి సంజయ్ అక్కడికి చేరుకుని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడారు. జగిత్యాల వైపు వెళ్లే బస్సులో ప్రయాణికులతో మాట్లాడి ఛార్జీల పెంపుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో…
ఏపీలో భారీ వర్షాల కారణంగా టమోటాల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు వంద దాటిపోగా ఇప్పుడు టమోటాల ధరలు కూడా వంద దాటిపోయాయి. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ అయిన మదనపల్లిలో కిలో టమోటా ధర ఏకంగా రూ. 130 పలుకుతున్నది. వి.కోట మార్కెట్లో 10 కేజీల టమోటాలు రూ.1500 పలుకుతున్నాయి. భారీ వర్షాలు కురవడంతో పంట పాడైపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వర్షాలు తగ్గి, వరద ఉధృతి పూర్తిగా తగ్గి మళ్లీ కొత్త…
రెండు వారాల క్రితం వరకు కూరగాయల ధరలు అదుపులో ఉన్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో కాయగూరల ధరలు పెరగడం మొదలుపెట్టాయి. చేతికి రావాల్సిన పంట వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. మహారాష్ట్రలో ఉల్లి పంట పాడైపోవడంతో ఉల్లి ధరలు పెరిగాయి. రెండు వారాల క్రితం కిలో ఉల్లి ధర రూ.25 వరకు ఉండగా, ఇప్పుడు ఆ ధరలు భారీగా పెరిగాయి. కిలో ఉల్లి ధర ఇప్పుడు రూ.50కి చేరింది. అటు టమోటా ధరలు సైతం…
కరోనా తరువాత వివిధ దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పాకిస్తాన్‌లో కూడా ఈ సంక్షోభం మొదలైంది. దేశంలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలను తగ్గించాలని ప్రజలు ఆందోళనల చేస్తున్నారు. కాగా, పెరిగిన ఈ ధరలపై పాక్ మంత్రి అలీ అమిన్ గందపూర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిత్యవసర ధరలు పెరిగాయి కాబట్టి ప్రజలు తక్కువ తినాలని అన్నారు. ద్రవ్యోల్భణం గురించి బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి ఈ…
దేశంలో ఈ ఏడాది కాలంలో పెట్రోల్ ధరలు రూ.20 మేర పెరిగాయి. దీంతో సామాన్యులు అవస్థలు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ తోపాటుగా వంటగ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.200 వరకు గ్యాస్ ధరలు పెరిగాయి. అయితే, దేశంలో పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం ఆఫ్ఘనిస్తాన్‌లో అంతర్యుద్ధమే అని, తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను అక్రమించుకోవడంతో ధరలు పెరిగాయని చెప్పుకొచ్చారు కర్ణాటక ఎమ్మెల్యే. హుబ్లీ -ధార్వాడ్ పశ్చిమ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ పెట్రోల్ ధరల పెరుగుదలపై…
దేశంలో కరోనా తరువాత ఎలక్ట్రిక్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. మొబైల్, పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్‌ట్యాప్ వంటి వాటి ధరలు కొంతమేర పెరిగాయి. ఇప్పుడు కార్ల ధరలు కూడా పెరగబోతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్లలో వినియోగించే ఎలక్ట్రానిక్ డివైజెస్‌లో చిప్‌లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. కరోనా కారణంగా వీటి దిగుమతి తగ్గిపోయింది. దీంతో ధరలు పెరిగిపోయాయి. కార్లలో వినియోగించే చిప్స్ ధరలు పెరిగిపోవడంతో కార్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్,…