రెండు వారాల క్రితం వరకు కూరగాయల ధరలు అదుపులో ఉన్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో కాయగూరల ధరలు పెరగడం మొదలుపెట్టాయి. చేతికి రావాల్సిన పంట వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. మహారాష్ట్రలో ఉల్లి పంట పాడైపోవడంతో ఉల్లి ధరలు పెరిగాయి. రెండు వారాల క్రితం కిలో ఉల్లి ధర రూ.25 వరకు ఉండగా, ఇప్పుడు ఆ ధరలు భారీగా పెరిగాయి. కిలో ఉల్లి ధర ఇప్పుడు రూ.50కి చేరింది. అటు టమోటా ధరలు సైతం పెరుగుతున్నాయి. కిలో టమోటా 20 అంటే అమ్మో అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆదే టమోటా బహిరంగ మార్కెట్లో రూ. 60 పలుకుతున్నది. రాబోయే రోజుల్లో టమోటా 100 కి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక్క ఉల్లి, టమోటా మాత్రమే కాదు మిగతా కూరగాయల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ధరలు పెరిగిపోతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పంటలు చేతికి వచ్చే వరకు ధరలు తగ్గకపోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Read: ఆ మహిళలు అస్సలు లావెక్కరట… ఎందుకో తెలుసా?