Price Hike: వర్షాకాలం ప్రారంభమవగానే కూరగాయల రేట్లకు అమాంతం రెక్కలు వచ్చాయి. గత వారం రోజుల్లోనే టొమాటోలతో సహా పలు కూరగాయలు ధరలు పెరిగాయి. అంతేకాకుండా పప్పుల ధరలు నింగికంటాయి. మరోవైపు కందిపప్పు ధరలు భారీగా పెరగడంతో.. జనాలు వాటిని తినడమే మానేశారు. ఇప్పుడు కందిపప్పు ధర ఆకాశానికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా కందిపప్పు ధరలో రూ.40 పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఒక కేజీ కందిపప్పు ధర 160 నుండి 170 రూపాయలకు పెరిగింది. దీంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: Jabardasth apparao: బ్రతికి ఉండగానే చంపొద్దు.. ఇంత దిగజారాలా?
మరోవైపు కూరగాయలలో టమాటా అత్యంత రేటు పలుకుతుంది. రిటైల్ మార్కెట్‌లో కొద్దిరోజుల క్రితం కిలో రూ.20 నుంచి 30 వరకు విక్రయించగా.. ఇప్పుడు రూ.80 నుంచి రూ.120కి పెరిగింది. దోసకాయ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. మార్కెట్‌లో గతంలో కిలో రూ.20 నుంచి 30 పలికిన దోసకాయ.. ఇప్పుడు రూ.40కి చేరింది. అదే విధంగా బెండకాయ ధర రూ.10 ఎగబాకగా.. ఇప్పుడు కిలో రూ.40కి విక్రయిస్తున్నారు. వారం క్రితం దీని ధర కిలో రూ.30 ఉండేది.
Read Also: PM Modi: రేపు 5 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని
ఇక మసాలా దినుసుల గురించి మాట్లాడితే.. జీలకర్ర ధర పెరుగుతూనే వస్తుంది. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో జీలకర్ర క్వింటాల్ రూ.62350కి చేరింది. అదేవిధంగా వెల్లుల్లి కూడా ఖరీదైంది. రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.100 నుంచి 120 వరకు విక్రయిస్తున్నారు. కాగా హోల్‌సేల్ ధరలో కూడా ఎగబాకింది. మరోవైపు ఢిల్లీలో కిలో 30 రూపాయలకు గోధుమ పిండిని విక్రయిస్తున్నారు. ఇది గతేడాది కంటే చాలా ఎక్కువగా ఉంది. అయితే కొన్ని నెలల క్రితం ఢిల్లీలో గోధుమ పిండి కిలో రూ.35 నుంచి 40కి చేరింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వమే మార్కెట్‌లో లక్షల టన్నుల గోధుమలను విక్రయించింది. దీంతో ఆ తర్వాత ధరలు మెరుగుపడ్డాయి.