దేశంలో కరోనా తరువాత ఎలక్ట్రిక్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. మొబైల్, పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్‌ట్యాప్ వంటి వాటి ధరలు కొంతమేర పెరిగాయి. ఇప్పుడు కార్ల ధరలు కూడా పెరగబోతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్లలో వినియోగించే ఎలక్ట్రానిక్ డివైజెస్‌లో చిప్‌లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. కరోనా కారణంగా వీటి దిగుమతి తగ్గిపోయింది. దీంతో ధరలు పెరిగిపోయాయి. కార్లలో వినియోగించే చిప్స్ ధరలు పెరిగిపోవడంతో కార్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రానిక్ కార్లవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ కార్లలో సెమీ కండక్టర్లను వినియోగిస్తారు. ప్రపంచంలో వీటి కొరత గణనీయంగా ఉన్నది. ఫ్రాన్స్‌కు చెందిన సోయిటెక్ సంస్థ ఈ సెమీ కండక్టర్లను తయారు చేస్తున్నది. అయితే, ప్రస్తుతం ఉన్న కొరతను అధికమించాలంటే 2023 వరకు సమయం పడుతుందని చెబుతున్నారు.