భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులో తొలి మ్యాచ్ జరుగుతోంది. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ మధ్య 177 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో.. భారత జట్టు మొదటి టెస్ట్ నాలుగో రోజు మ్యాచ్‌పై పట్టు బిగించింది. అయితే న్యూజిలాండ్ బౌలర్లు 54 పరుగులకు ఏడు వికెట్లు తీసి అద్భుతంగా పునరాగమనం చేశారు.