బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో అర్థాంతరంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు బెంచ్ కోర్టు హాలులోనే వెల్లడించారు. ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేనని చెప్పి రాజీనామా ప్రకటించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఓఆర్ఆర్ లీజు టెండర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓఆర్ఆర్ టెండర్ వివరాలను తెలుసుకోవడానికి ఆర్టీఐ ద్వారా సంప్రదిస్తే అందుకు సమాధానం రావడం లేదని పిటిషన్‌లో కోర్టుకు తెలిపారు. breaking news, latest news, telugu news, high court, revanth reddy,
బిగ్‌బాస్ రియాల్టీ షోపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమం ప్రసారానికి ముందు సెన్సార్‌షిప్ చేయకపోతే ఎలా అంటూ నిర్వాహకుల్ని ప్రశ్నించింది. అలాగే ఈ షో ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అందే ఫిర్యాదులను పరిశీలించడం పోస్టుమార్టంతో పోల్చింది.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టు మళ్లీ షాక్ ఇచ్చింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలుగా శాసనసభ్యుడిగా తన ఎన్నిక చెల్లదన్న తీర్పుపై స్టే ఇవ్వాలని వనమా వెంకటేశ్వర్ రావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. వనమా విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు మధ్యంతర తీర్పును న్యాయస్థానం కొట్టివేసింది.
మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. తాను సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు తీర్పును నిలిపివేయాలని పిటిషన్ వేశారు. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.