సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ కేసులో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. జత్వానీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ.. అయితే, విచారణలో కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి.. ఇప్పటి వరకు ఈ కేసులో A2గా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజ నేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు..