తెలంగాణలో ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిగా పేరు పొందిన నానక్‌రాంగూడలోని స్టార్ హాస్పిటల్స్, వరల్డ్ లివర్ డే 2025 సందర్భంగా స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ అధ్వర్యంలో “లివర్ హెల్త్ ఇనిషియేటివ్”ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం నానక్‌రాంగూడలోని స్టార్ హాస్పిటల్స్ 10వ అంతస్తులో ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమై, ఆరోగ్య నిపుణులు, రోగులు, మరియు కమ్యూనిటీ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు ప్రత్యేక లివర్ క్లినిక్‌లు ప్రారంభించబడ్డాయి, ఇవి కాలేయ సంబంధిత వ్యాధులను…