ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం వీఎం బంజర్‌లో కుమారుడి అంత్యక్రియల సందర్భంగా హెల్మెట్ వినియోగించాలంటూ ఓ తండ్రి చేసిన విజ్ఞప్తి అందరినీ కలచివేసింది. ఖమ్మం బస్టాండ్ సమీపంలో జనవరి 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఎం బంజర్ గ్రామం వద్ద సోమ్లానాయక్ తండాకు చెందిన తేజావత్ సాయి(18) తలకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అంతిమయాత్రలో ఉన్న యువకుడి తండ్రి తేజావత్ హరి తన కుమారుడి మృతితో భావోద్వేగానికి లోనయ్యారు.…