Cyclone Montha: మొంథా తుఫాన్ తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తోంది.. దీంతో, రెడ్ అలర్ట్ జారీ చేశారు.. ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మొంథా కొనసాగుతుండగా.. గత 6 గంటల్లో గంటకు 17 కిలో మీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది.. ప్రస్తుతం మచిలీపట్నంకి 190 కిలో మీటర్ల దూరంలో.. కాకినాడకు 270 కిలో మీటర్ల దూరంలో.. విశాఖపట్నంకు…
Heavy Rains in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కి మరో తుఫాన్ ముప్పు పొంచిఉంది.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది తీవ్ర అల్పపీడనం.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నేడు వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని.. రేపు తీవ్ర వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు.. ఎల్లుండికి నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో ఇవాళ కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి…
Heavy Rains: వందంటే వర్షం.. కురుస్తోంది.. కుండతో పోసినట్టు.. ఆకాశానికే చిల్లు పడిందా.. మేఘాలు పగిలి ఒకేసారి పడిపోయాయా అనే విధంగా వర్షాలు పడుతున్నా్యి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. అత్యధికంగా యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 13 సెంటీమీటర్ల వాన కురిసింది. జనగామ జిల్లా దేవరుప్పలలో 12 సెం.మీ వర్షపాతం రికార్డయింది. మెదక్ జిల్లా అల్లాదుర్గ్‌లో 10 సెం.మీ వాన కొట్టింది. మేడ్చల్ జిల్లా కీసరలో 10 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా…
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతోంది ఉపరితల ఆవర్తనం.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. ఇక, అల్పపీడనం ప్రభావంతో ఇవాళ విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఆరెంజ్ బులెటిన్ హెచ్చరికలు జారీ చేసింది విశాఖపట్నం వాతావరణ కేంద్రం..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారింది.. ఇది, ఆంధ్రప్రదేశ్‌కు ముప్పుగా మారుతోంది. తమిళనాడు తీరానికి చేరువగా వచ్చి దిశను మార్చుకుంటుందని.. ఆ తర్వాత ఏపీ తీరం వెంబడి బలమైన ఈదురు గాలులతో పయనిస్తుందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ వుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది..