ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. సుమారు 3353 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ రూ.1.92 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. విదేశీ ప్రయాణీకులు బంగారాన్ని పేస్టుగా మార్చి లగేజ్ బ్యాగ్ లో దాచి పట్టుకొస్తుండగా తనిఖీలు చేపట్టడంతో బట్టబయలైంది. దుబాయ్ నుండి తీసుకొచ్చిన బంగారాన్ని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వాష్ రూమ్ వద్ద మరో వ్యక్తికి అప్పగిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.