ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఇటు విజయవాడ సిటీతో పాటు.. అటు వైజాగ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తుంది.. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది అమరావతి వాతావరణ కేంద్ర… ఏపీలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన…
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం, చిరుజల్లులు పడుతుండగా.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు తప్పేలా లేవని హెచ్చరిస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య బంగాళాఖాతం నుంచి నైరుతి దిశవైపునకు వంపు తిరిగి ఉన్నదని, వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయవ్యదిశగా కదలొచ్చని అంచనా వేస్తోంది హైదరాబాద్…
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కోత్రా గ్రామంలో కొంత మంది ఇంటి పైకప్పుపై ఉన్నారనే సమాచారంతో.. వారిని తీసుకొచ్చేందుకు మంత్రి నరోత్తమ్ మిశ్రా.. బోటుపై అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో బోటుకు అడ్డుగా చెట్టుకూలిపోవడంతో.. ఆయన చిక్కుకుపోయారు. ఈ సమయంలో తమను రక్షించాలంటూ అధికారులకు మెసేజ్‌లు పెట్టారు.…
ఎడతెరపి లేని వర్షాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోదావరిఖని శివారు గోదావరి నది వంతెన వద్ద వరద నీటిలో సమ్మక్క సారలమ్మ గద్దెలు మునిగిపోయాయి. గోదావరి ఓడ్డున ఉన్న బోట్ వరద ప్రభావంతో రాజీవ్ రహదారి వద్దకు కొట్టుకువచ్చింది. నది సమీపంలోని ఇటుక బట్టీలలో పనిచేసే 20 కుటుంబాలు వరదరలో చిక్కుకోవడంతో మర బోట్ ల ద్వారా వారిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు. వరద నీటిలో గోదావరిఖని లారీ…
నిర్మల్ జిల్లా నీటిమయమైంది. జిల్లా అంతటా ఎటు చూసినా వరదలే కనిపిస్తున్నాయి. ప్రధాన వీధులు శివారు ప్రాంతాలు జలమయమైయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమములోనే రహదారులపైకి భారీగా చేపలు వచ్చాయి. దీంతో పలువురు స్థానికులు రోడ్లపై చేపలు పట్టారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక నిర్మల్ వరద పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో సీఎం కేసీఆర్ ఆరా తీశారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి…
తెలంగాణలో వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలపై ఉన్నతస్థాయి రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఇరిగేషన్, పంచాయితీరాజ్, మున్సిపల్, విద్యుత్ శాఖ, ఇతర ఉన్నత అధికారులు హాజరైయ్యారు. దావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో వర్షాలు కురుస్తున్నందున ప్రజాప్రతినిధులు, అధికార…
ముంబై మహానగరానికి వరుసగా సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశం మొత్తంలోనే అత్యధిక కరోనా కేసులు అక్కడే వచ్చాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రెండూ ముంబైనే టార్గెట్ చేశాయి. ఆ ఎఫెక్ట్ విపరీతంగా పడింది బాలీవుడ్ మీద! రెండు సంవత్సరాలుగా బీ-టౌన్ పదే పదే చతికిలపడుతోంది. అయితే, రీసెంట్ గా లాక్ డౌన్ ఎత్తేశాక మాత్రం బాలీవుడ్ బడా స్టార్స్ అందరూ ఒకేసారి బరిలోకి దిగారు. చకచకా షూటింగ్ లు కంప్లీట్ చేసేస్తున్నారు. అయితే, ఇంతలో భారీ వర్షాలు…
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి…
హైదరాబాద్ లో భారీ వర్షాలకు పురాతన, శిథిలావస్థలో వున్న భవనాలు కుప్పకూలుతున్నాయి. బుధవారం ఓల్డ్ మలక్ పేట్ గంజ్ లోని మహబూబ్ మేన్షన్ ప్యాలెస్ చూస్తుండగానే కుప్పకూలింది. గత నాలుగు రోజులుగా నగరంలో కురుస్తున్న వానలకు ఈ భవనం బాగా నానిపోయింది. చాలా కాలం నుంచి ఈ భవనం పటిష్టతపై అనుమానాలు వస్తూనే వున్నాయి. వర్షాలకు బాగా నానిన భవనం ఒక్కసారిగా కూలిపోయింది. కాగా, తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని…