Heavy Rains: రానున్న 5 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు.. కర్నాటకలో 8 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయి. రుతు పవనాల మూలంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా అడపాదడపా కురిసిన వర్షంతో శుక్రవారం సాయంత్రం ముంబయిలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కర్నాటకలో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలు కారణంగా రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 8కి చేరుకుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు తమ ప్రతాపం చూపుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. రానున్న రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జులై 11 వరకు 8 రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో గోవా, కేరళ ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవు ప్రకటించాయి.
Read also: Venkateshwara Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే పాపాలు ప్రక్షాళన అయిపోతాయి.
Also Read
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
- BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల ఐదు రోజుల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని శుక్రవారం అంచనా వేసింది. ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాంలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్నాటకలో భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 8కి చేరుకుంది. గత 24 గంటల్లో దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో కురిసిన వర్షాలకు మొత్తం 35 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 12 ఇళ్లు పాక్షికంగా, ఒక ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నాయని దక్షిణ కన్నడ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ఇదే సమయంలో మెస్కాంకు చెందిన 108 విద్యుత్ స్తంభాలు, నాలుగు ట్రాన్స్ఫార్మర్లు, 5.02 కిలోమీటర్ల విద్యుత్ సరఫరా లైన్ దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి సంబంధిత అధికారులు తెలిపారు.
Read also: McDonald’s: మెక్ డొనాల్డ్స్‌కి టమాటా దెబ్బ.. బర్గర్లలో బంద్..
రాబోయే 5 రోజుల్లో సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, బీహార్, జార్ఖండ్ లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కేరళ, కర్నాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. కొంకణ్, గోవా, గుజరాత్, దక్షిణ ద్వీపకల్పంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో రానున్న నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నేడు అమృత్ సర్, గురుదాస్ పూర్, పఠాన్ కోట్, కతువా, ఉధంపూర్, రియాసి, జమ్మూ, రాజౌరీ, పూంచ్, బారాముల్లా, బుద్గాం, అనంత్ నాగ్, శ్రీనగర్, పుల్వామా, కిష్త్వార్, దోడా, చంబా, లాహుల్ అండ్ స్పితి, కాంగ్రా, మండి, సోలన్, సిమ్లా, సిర్మౌర్, యమునానగర్, శరణ్ పూర్, ముజఫర్ నగర్, మీరట్, బిజ్నోర్, జ్యోతిబాపూలే నగర్, సంభాల్, రాంపూర్, మొరాదాబాద్ లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జూలై 9న అమృత్ సర్, గురుదాస్ పూర్, పఠాన్ కోట్, కటువా, ఉధంపూర్, రియాసి, జమ్మూ, రాజౌరీ, పూంచ్, బారాముల్లా, బుద్గాం, అనంత్ నాగ్, శ్రీనగర్, పుల్వామా, కిష్త్వార్, దోడా, చంబా, లాహుల్ అండ్ స్పితి, కాంగ్రా, మండి, సోలన్, సిమ్లా, సిర్మౌర్, యమునానగర్, శరణ్ పూర్, ముజాఫర్ నగర్, మీరట్, బిజ్నోర్, జ్యోతిబాపూలే నగర్, సంభాల్, రాంపూర్, బిచ్చోర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, జూలై 10న నైనిటాల్, చంపావత్, అల్మోరా, బాగేశ్వర్, పితోర్గఢ్, అనంత్నాగ్, సిరోహి, పాలి, జల్పాయిగురి, అలీపుర్దువార్, కూచ్ బెహర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 11న నైనిటాల్, చంపావత్, అల్మోరా, బాగేశ్వర్, పితోర్గఢ్, ఉధమ్ సింగ్ నగర్, జల్పాయిగురి, అలీపుర్దువార్, కూచ్ బెహార్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
-
BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!