Heavy rains in Kerala: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కేరళలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, కన్నూర్ జిల్లాల్లో గురువారం రోజు మొత్తం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురం మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ.24 గంటల్లో 20 సెంటీమీటర్ల కన్నా అధిక వర్షం కురిస్తే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు.