Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది.. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. ఇంకా కొన్ని చోట్ల భారీ వర్షలు కురుస్తున్నాయి.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అయితే ఈ రోజు వడగళ్లవానతో భారీ నష్టం వాటిల్లింది.. హైదదరాబాద్, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియగా.. శివారు ప్రాంతాలు, కొన్ని జిల్లాల్లో వడగళ్లవాన పడింది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల…
మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నైరుతి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కర్నూలు, కడప, విశాఖ, ఒంగోలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. పలుచోట్ల ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ ఈదురు గాలులకు కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి.…
ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలో వరదలు సంభవించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో తీవ్ర పంట, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. వర్షాలతో అన్నమయ్య ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరడంతో అన్నమయ్య జలాశయం కొట్టుకుపోయింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవడం మానవ తప్పిదం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు చేశారు. చంద్రబాబు మాటలకు కౌంటర్‌గా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. అన్నమయ్య ప్రాజెక్ట్ కెపాసిటీ 2లక్షల 17…
ఉత్తరాంధ్ర, ఒడిషాల వైపు జవాద్ తీవ్ర తుఫాన్ ముప్పు ముంచుకు వస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ రోజు అర్ధరాత్రి వాయుగుండం ఏర్పడనుంది. ఆ తర్వాత 24గంటల్లో తుఫాన్ గాను అనంతరం తీవ్ర తుఫాన్ గాను మారుతుంది. ఇప్పటికి ఉన్న అంచనా ప్రకారం ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులతో ప్రయాణిస్తుంది. దీని ప్రభావం వల్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని పర్యాటక ప్రదేశాలు 3రోజుల…
మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతోనే ఏపీ అతలాకుతలమైంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో తుఫాన్ ఏపీపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన ఫలితాల ప్రకారం.. గత నెల 29న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఇప్పుడు వాయుగుండంగా బలపడి ఎల్లుండి తుఫాన్ గా మారే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఏపీ, ఒడిశాలో 4న ఉదయం తీరం దాటుతుందని అంచనా వేస్తున్నట్లు వాతావరణ…
వరద ప్రభావిత ప్రాంతాలైన వైయస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్ రేపు, ఎల్లుండి పర్యటించనున్నారు. తొలిరోజు వైయస్సార్ కడప, చిత్తూరు జిల్లాలలో పర్యటించి నేరుగా బాధిత ప్రజలు, రైతులతో సీఎం ఇంటరాక్ట్ కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును సీఎం పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలతో వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా ప్రజలతో సీఎం ముచ్చటిస్తారు. మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన…
ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎంతో సమావేశం నిర్వహించింది. అనంతరం కేంద్రం బృందం సభ్యుడు కునాల్ సత్యార్థి మాట్లాడుతూ.. కేంద్ర బృందం తరుపున వివరాలను సీఎం జగన్‌కు సమర్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా వరద ప్రభావం వల్ల కడప జిల్లాలో భారీ నష్టం జరిగిందన్నారు. పంటలు, పశువులు కొట్టుకుపోయాయని, అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిన చోట అపార నష్టం…
వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాసారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ. 6054 కోట్ల నష్టం వాటిల్లితే.. కేవలం రూ. 35 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేయడం సరైవ పద్దతి కాదని, ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన రూ. 1100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని కాగ్ తప్పు పట్టిందన్నారు. జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహాణ నిబంధనలకు విరుద్దంగా…