Heavy Drug Seizure: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డగా మారుతున్నాయి విమానాశ్రయాలు. ఇటీవలి కాలంలో దేశంలో పలు విమానాశ్రయాలలో అక్రమంగా ఇండియాలోకి తీసుకు వస్తున్న డ్రగ్స్ ను పట్టుకుంటున్నారు కస్టమ్స్ అధికారులు.
అధికారులు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా.. డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతూనే ఉంది. ఎన్నిసార్లు పట్టిబడిన డ్రగ్స్ మాఫియాలో ఎలాంటి మార్పు రావటం లేదు. అయితే తాజాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. జోహన్నెస్బర్గ్ నుండి ఢిల్లీ వచ్చిన ఇద్దరు స్మగ్లర్ల వద్ద 98 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించారు పోలీసులు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి 14 కేజీల డ్రగ్స్ ను తరలించే ప్రయత్నం చేశారు నిందితులు.…