తెలుగు రాష్ట్రాల్లో వానలు పడుతున్నప్పటికీ ఉక్కపోత కొనసాగుతోంది. రాబోయే 4-5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.