Covid vaccine: ఇటీవల కాలంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌కి సంబంధం ఉందనే వార్తల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా క్లారిటీ ఇచ్చారు. గుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్‌లు కారణం కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నిర్వహించిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ మాండవియా శనివారం తెలిపారు. ఏఎన్ఐ డైలాగ్స్ 2024లో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఎవరికైనా స్ట్రోక్ వచ్చినట్లయితే, అది కోవిడ్ వ్యాక్సిన్ వల్లే అనే భావిస్తున్నారు, గుండెపోటుకు…
Heart Attacks: ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణాల సంఖ్య పెరుగుతోంది. గతంలో వయసు పైబడినవారికి వచ్చే ఓ జబ్బుగా గుండెపోటు ఉండేది. కానీ ఇప్పుడు యువతలో ముఖ్యంగా టీనేజ్ లో కూడా గుండెపోటు రావడం తద్వారా మరణాలు సంభవించడం చోటు చేసుకుంటోంది. ఇదిలా ఉంటే గుండెపోటుపై ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఓ అధ్యయాన్ని నిర్వహించింది. ఇది టాప్ మెడకల్ జర్నల్ అయిన ది లాన్సెట్ లో ప్రచురించబడింది.
Mansukh Mandaviya: కరోనా ఒక వైరస్, ఇది పరివర్తన చెందుతూనే ఉంటుందని, భారతదేశంలో ఇప్పటి వరకు 214 విభిన్న రకాలను కనుగొన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఇటీవల కరోనా కేసుల్లో పెరుగుదల ఉందని, ఎదుర్కొవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఐసీయూ, ఆక్సిజన్ సరఫరా ఇతర ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని, వారానికోసారి సమీక్ష జరుగుతోందని ఆయన అన్నారు. కోవిడ్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అంచనా వేయడం అసాధ్యం అని, ప్రస్తుతం వస్తున్న వేరియంట్లు…