Video Games: ఈరోజుల్లో ప్రతి ఇంట్లో చిన్నారులు వీడియో గేమ్స్‌తో మాత్రమే కాలక్షేపం చేస్తున్నారు. చిన్నారులకు స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ ఉంటే చాలు. తిండి తినడం కూడా మానేస్తున్నారు. వీడియో గేమ్స్‌కు అంతగా వాళ్లు ఎడిక్ట్ అయిపోయారు. అయితే ఈ వ్యాపకం పిల్లలకు ప్రాణాపాయంగా పరిణమించే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియాలోని హార్ట్ సెంటర్ ఫర్ చిల్డ్రన్ పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ మేరకు అధ్యయనం చేసిన నివేదికను సైంటిస్టులు హార్డ్ రిథమ్ అనే జర్నల్‌లో ప్రచురించారు.…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలిసారి అధునాతన సింథటిక్ క్యాడవర్‌తో కూడిన స్కిల్ ల్యాబ్, బర్తింగ్ సిమ్యులేటర్ ఏర్పాటు చేయగా.. గవర్నర్ తమిళిసై మంగళవారం నాడు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నేను మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే వివాహం చేసుకున్నా.. మీరు కూడా వయసులో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకోండి, చదువు అయిపోయేంత వరకు ఆగొద్దు’ అంటూ విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. Read Also:…
తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా తన బిడ్డలకు ఆ కష్టం తెలియకుండా పెంచుకుంటుంది అమ్మ. దేవుడు తాను అంతటా ఉండలేకే అమ్మను సృష్టించాడు. కడుపులో బిడ్డ పెరుగుతున్నాడనే విషయం దగ్గర నుంచి బిడ్డ బయటకు వచ్చేవరకు తానే అన్నీ వుండి పెంచుతుంది ఆకన్న తల్లి. అలాంటి తల్లికి గర్భంలో నలుసు పెరుగుతుంటే తనుఎన్నికష్టాలు ఎదుర్కొంటుందో తెలుసా.. ఆమెలో నెల నెలకు పెరుగుతున్న బరువుతో పడుకోవడానికి కూడా ఎంతగా కష్టపడుతుందో ఆతల్లికి మాత్రమే తెలుసు. అయితే కడుపులో నలుసు…
ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అధిక బరువు. అయితే బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయాత్నాలు చేసినా ఫలితం కనిపించడంలేదని కొందరు విసుగు చెందుతుంటారు. అలాంటి వాళ్లు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే పరగడుపుతో నిమ్మరసం తాగితే ఉపయోగం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ఫలితం కనిపిస్తుందని.. తేలికగా బరువు తగ్గవచ్చని చెప్తున్నారు. పరగడుపున నిమ్మరసం తాగితే పగటిపూట అధిక ఆకలి కోరిక తగ్గుతుంది.…
చర్మ సంరక్షణకు సంబంధించి అర్థంలేని ప్రచారాలు అనేకం. వాటిలో నిజమెంత, అసత్యాలెన్ని అన్నది తెలుసుకోవాల్సిందే. ఈ మధ్యకాలంలో ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ అనే పదాలు సౌందర్య ఉత్పత్తుల విషయంలో బాగా వినిపిస్తున్నాయి. నిజానికి రసాయనాలు లేకుండా ఏ సౌందర్య సాధనాన్నీ తయారు చేయలేరు. కానీ, ఆయా ఉత్పత్తుల మీద ఉన్న పేర్లను బట్టి ఏదేదో ఊహించుకుంటాం. చర్మానికి కొన్ని ఉత్పత్తులు రాసినప్పుడు కొంత మంట కలుగుతుంది. అందులోని ఆల్కహాల్ లేదా మెంథాల్ దీనికి కారణం. విపరీతమైన మంట…
దేశంలోని యువతకు గుండెపోటు టెన్షన్ పట్టుకుంది. గుప్పెడంత గుండె చిన్న వయసులోనే ముప్పుకు గురవుతోంది. దక్షిణాసియా దేశాల్లోని 7 శాతం జనాభాకు గుండెపోటు భయం వెంటాడుతోంది. వీరిలో ఎక్కువగా భారతీయులే ఉండటం కలవరపెడుతోంది. అయితే మహిళల కంటే పురుషుల్లోనే గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటోందని ఇటీవల ఓ సర్వేలో స్పష్టమైంది. గుండె జబ్బుల ముప్పు మగాళ్లలో 21.4 శాతం, మహిళల్లో 12.7 శాతంగా ఉందని తేలింది. ఫిట్‌గా ఉన్నా కొంచెం ఫ్యాట్ ఎక్కువైనా గుండెపోటు వస్తుండటంతో ఏం…