శరీర ఉష్ణోగ్రత సాధారణ టెంపరేచర్ కంటే మించినప్పుడు జ్వరం బారిన పడుతుంటారు. ఫీవర్ తో ఉన్నప్పుడు కొందరు సొంత వైద్యానికి పూనుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జ్వర తీవ్రత పెరిగి ఆరోగ్యం ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే జ్వరం వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించాలని సూచిస్తు్న్నారు నిపుణులు. జ్వరంతో ఉన్నప్పుడు పలు రకాల ఆహార పదార్ధాలను కూడా తీసుకోవద్దని సూచిస్తున్నారు.
జ్వరంతో బాధపడుతున్నప్పుడు సాధారణంగా ఏమీ తినాలనిపించదు. ఏం తిన్నా నోటికి రుచించదు. కానీ, ట్రీమ్‌మెంట్ తీసుకుంటూనే మంచి ఆహారం కూడా తినాలి. అదే విధంగా తినకూడని కొన్ని ఆహార పదార్థాలు, చేయకూడని కొన్ని పనులు కూడా ఉంటాయి. జ్వరంతో ఉన్నప్పుడు చల్లని నీటితో స్నానం చేయకూడదు. చన్నీటి స్నానం మంచిది కాదు. చన్నీటి స్నానం చేస్తే.. షివరింగ్ వచ్చి.. శరీర ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంది. చల్లటి పదార్థాలు. అంటే ఐస్‌క్రీమ్ లాంటివి తినకూడదు. సోడా, ఆల్కాహాల్ తాగొద్దు. కెఫిన్ ఉండే డ్రింక్స్ తాగొద్దు. వీటి వల్ల బాడీ డీహైడ్రేషన్‌కి గురి కావొచ్చు.
చాలా మంది జ్వరం వస్తే దుప్పటి కప్పుకొని పడుకుంటూ ఉంటారు. అలా దుప్పటి కప్పుకొని పడుకుంటే.. శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. ఆకలి లేకపోయినా.. జ్వరం తగ్గేందుకు శక్తి, పోషకాలు శరీరానికి అవసరం అవుతాయి. అందుకే మంచి పోషకాహారం తినాలి. పాలు, పండ్లు తీసుకోవాలి. పిల్లలకు జ్వరం వస్తే.. వాళ్లు ఏం తినరు. బలవంతంగానైనా.. తక్కువ మోతాదులో అయినా పోషకాహారం తినిపించాలి. శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వకుండా అలసటకు గురయ్యే పనులు ఏమీ చేయకూడదు.