రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాల భూములపై వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. భూములు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సీయూకి) చెందినవే అని, వాటిని వేలం వేయొద్దంటూ విద్యార్థులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. భూముల వివాదంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మూడేళ్లలో మరలా అధికారంలోకి వస్తామని, ఆ 400 ఎకరాలు తిరిగి రిటర్న్…