యంగ్ హీరో సంతోష్ శోభన్ పుట్టిన రోజు ఇవాళ. పాతికేళ్ళు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి సంతోష్ శోభన్ అడుగుపెట్టాడు. ‘వర్షం’ ఫేమ్ స్వర్గీయ శోభన్ కొడుకైన సంతోష్ కు యుక్త వయసులోనే నటన వైపు గాలి మళ్ళింది. సుమంత్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన ‘గోల్కొండ హైస్కూల్’లో హైస్కూల్ విద్యార్థిగా సంతోష్ నటించాడు. ఆ తర్వాత యుక్తవయసులోకి అడుగు పెట్టగానే ‘తను -నేను’ తో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘పేపర్ బోయ్’లోనూ కథానాయకుడిగా…