తమిళ స్టార్ హీరో కార్తీ ఈరోజు 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్తీ అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలను జరుపుకోవద్దంటూ అభిమానులను అభ్యర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తన పుట్టినరోజున అభిమానులు తమ కుటుంబంతో కలిసి ఇంట్లో ఉండటమే తనకు వారిచ్చే మంచి బహుమతి అని అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో మాస్కులు, శానిటైజర్లు వాడడం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ లాక్డౌన్, భద్రతా చర్యలకు…