(సెప్టెంబర్ 2న జీవిత రాజశేఖర్ పుట్టినరోజు)“కార్యేషు దాసి… కరణేషు మంత్రి…” అంటూ శాస్త్రకారులు స్త్రీని షట్కర్మయుక్తగా చిత్రీకరించారు. చిత్రసీమలో అలాంటివారు అరుదుగా కనిపిస్తారు. నటి, దర్శకురాలు జీవితను చూస్తే ఆమె నిజంగానే షట్కర్మయుక్త అనిపిస్తారు. తన భర్త డాక్టర్ రాజశేఖర్ ను హీరోగా నిలపడంలోనూ, స్టార్ హీరోని చేయడంలోనూ, అతని విజయానికి వెన్నెముకగా నిలచి జీవిత సాగుతున్నారు. తెలుగు చిత్రసీమలో అలా సాగిన వారిలో కృష్ణ, విజయనిర్మల దంపతులు ముందుగా గుర్తుకు వస్తారు. తరువాత జీవిత, రాజశేఖర్…