తీవ్ర ఎండలతో దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొంది. నీటి కొరత నేపథ్యంలో ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతిషి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీలకు లేఖ రాశారు. వర్షాకాలం వచ్చే వరకు ఢిల్లీకి నెల రోజుల పాటు నీటిని విడుదల చేయాలని కోరారు. ఢిల్లీ ఈ ఏడాది అత్యంత నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, గత సంవత్సరాల్లో కాకుండా ఈ ఏడాది నీటి డిమాండ్ చాలా రెట్లు పెరిగిందని…
హర్యానాలోని సోనిపట్ లోని ఫిరోజ్ పూర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో అపార ఆస్తి నష్టం సంభవించింది. ఈ రాసే నాటికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న తరువాత అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు కొన్ని గంటలపాటు పోరాడారు. ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు ఆన్‌లైన్ లో కనిపించాయి. కర్మాగారం నుండి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ…
తాగునీటి కోసం ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. గత కొద్ది రోజులుగా తాగునీటి సమస్యతో దేశ రాజధాని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినా నీళ్లు సరిపోవడం లేదు.
హర్యానాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గురుగ్రామ్‌లోని మనేసర్‌లోని ఓ బట్టల తయారీ యూనిట్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.
హర్యానాలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ఇద్దరు అగంతకులు చైన్ చోరీకి ప్లాన్ వేశారు. అంతే రోడ్డు ప్రక్కన ఉన్న షాపు దగ్గర ఉన్న మహిళ మెడలోంచి చైన్ లాక్కుని.. బైక్ ఎక్కి పారిపోతుండగా.. దూరం నుంచి గమనిస్తున్న ఓ బస్సు డ్రైవర్ సాహసం చేసి వారిద్దరిని ఢీకొట్టాడు.
హర్యానాలోని సోనిపట్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో మంగళవారం మంటలు చెలరేగాయి. ఆ సమయంలో.. ఫ్యాక్టరీలో ఉన్న సిలిండర్లు మంటలు అంటుకుని పేలాయి. దీంతో.. మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా కార్మికులు మంటల్లో చిక్కుకుని కాలిపోయారు. అయితే.. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని ఫ్యాక్టరీలో మంటల్లో చిక్కుకున్న కార్మికులను కొంతమందిని…
సార్వత్రిక ఎన్నికల వేళ హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఆరో విడతలో భాగంగా హర్యానాలో పోలింగ్ జరుగుతోంది. అయితే ఆ రాష్ట్రానికి చెందిన బాద్షాపూర్ ఎమ్మెల్యే రాకేష్ దౌల్తాబాద్ (44) గుండెపోటుతో మరణించారు
ప్రేమించే ముందు ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత.. అడ్డు తొలగించుకోవడానికి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అందుకే ప్రేమించే ముందే.. భవిష్యత్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ప్రేమించాలి. అయితే తాజాగా.. ప్రేమించిన ప్రియుడిని కాదనుకునేందుకు హత్య చేసింది ప్రియురాలు. ఈ ఘటన హర్యానాలోని తిక్రీ గ్రామంలో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది.
Loksabha Election 2024 : ఎన్నికల విధుల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. హర్యానాలోని జింద్‌లోని విద్యాశాఖలో ఓ ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.