తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సోమవారం హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గ్రామానికి చేరుకున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా తుమ్మలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం తుమ్మలూరులో కార్యక్రమంలో భాగంగా మహా గని మొక్కను నాటారు.