Harish Rao: కవిత అరెస్ట్ అక్రమం.. ఇది బీజేపీ, కాంగ్రెస్ కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఈడీ అధికారుల తీరును తప్పుపట్టారు. కవిత అరెస్ట్ అక్రమం, అప్రజాస్వామికం అంటూ ధ్వజమెత్తారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ కుట్ర అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
బీజేపీ నాయకులు గత కొంతకాలంగా కవితను అరెస్టు చేస్తామని ఈడీ అధికారుల మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారని తెలిపారు. కేసీఆర్ డిమోరలైజ్ చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నాయని ఆరోపించారు. అయిని అరెస్టులు బీఆర్ఎస్‌కు కొత్తేమీ కాదని పేర్కొన్నారు. 14 ఏళ్లు పోరాడిన పార్టీ అని.. రాజకీయంగా, న్యాయ పరంగా పోరాటం చేస్తామని తెలిపారు. కవిత పిటిషన్‌ను ఈరోజు సుప్రీంకోర్టు మూడు రోజులు వాయిదా వేసిందని గుర్తుచేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన మాటకు విరుద్ధంగా ఈడీ అరెస్టు చేయడం సరికాదన్నారు. అయినా మహిళల్ని సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత అరెస్టు చేయడంపై కోర్టులో కేసు నడుస్తోందని వ్యాఖ్యానించారు.
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను దెబ్బతీయడానికే కవితను అరెస్టు చేశారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు, దాడులు జరిగాయని.. రాజకీయంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
కవిత అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయా ప్రాంతాల్లో ధర్నాలు, నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.
ప్రజా కోర్టులో కాంగ్రెస్, బీజేపీలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. కోర్టు వేళలు ముగిసిన తర్వాత వచ్చి సోదాల పేరుతో వచ్చి అరెస్టు చేయడం సరికాదన్నారు. అయినా న్యాయ వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని. న్యాయ పోరాటం చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!