తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో చాలా తండాలకు రోడ్డుమార్గం లేదని, తండాలకు 100 శాతం బీటీ రోడ్లు వేయాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వంలో చాలా గ్రామాలకు నీరు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తండాలు, గూడాల్లో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి జరిగినట్లు అని ఆయన వ్యాఖ్యానించారు. చేసిన తప్పులకు శిక్షపడ్డా ఇంకా మారడం లేదని సీఎం…
కేంద్రబడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ఏపీ వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడారని, తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా అంటూ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మీద ఆరోపణలు మానుకోవాలని సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నోరు పారేసుకోకు అని అన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు సముద్రం పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ది అని దుయ్యబట్టారు. సన్నాయి నొక్కులు నొక్కడం మానుకో హరీష్ రావు అని విమర్శించారు. మేడిగడ్డలో కుంగిన బ్లాకులు మీరు ఎందుకు రిపేర్ చేయలేదని ప్రశ్నించారు. హరీష్ స్థాయి తగ్గించుకుంటున్నాడని…
మాజీ మంత్రి, బీర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి రూ.500 కోట్లు వచ్చినా విడుదల చేయట్లేదని అన్నారు. గ్రామ పంచాయతీల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. సర్పంచ్లు ఆగమయ్యాం అని తనకు వినతిపత్రం ఇస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షం తట్టిలేపితే కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం గ్రామ పంచాయతీల ట్రాక్టర్లకు…
Shabbir Ali Comments on Harish Rao: రైతు రుణమాఫీపై బీఆర్ఎస్కు మాట్లాడే అర్హత లేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. హరీశ్రావు ఎప్పుడు రాజీనామా చేస్తారో? చెప్పాలన్నారు. రుణమాఫీ చేయడం బీఆర్ఎస్కు ఇష్టం లేదని, అందుకే అవాకులు చెవాకులు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డిలో కాంగ్రెస్ రైతుర్యాలీ నిర్వహించింది. రుణమాఫీ సంబరాల్లో భాగంగా రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ…
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైరయ్యారు. రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తామన్నోళ్లు పారిపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు.
ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం అవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట అని ఆయన విమర్శించారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి…
మాజీ మంత్రి హరీష్ రావును కేంద్ర మంత్రి బండి సంజయ్ పొగడతలతో ముంచెత్తారు. ఉద్యమం చేసి ప్రజల్లో అభిమానం ఉన్న నేత అని అన్నారు. హరీష్ రావు మంచి నాయకుడు.. హరీష్ రావు ప్రజల మనిషి అని తెలిపారు. కేటీఆర్, కేసీఆర్ మాత్రం ప్రజల విశ్వాసం కోల్పోయిన నేతలు అంటూ, హరీష్ రావు మంచి నాయకుడు పొగిడారు. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలతో చర్చలు జరిపారా అంటూ మీడియా ప్రశ్నించగా.. ఆయన స్పందించారు.
గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనలు.. ప్రభుత్వం పరిష్కరించాల్సిన డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం అని అన్నారు. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు.