Harish Rao challenges Nirmala Sitharaman: రేషన్ షాపు దగ్గర ప్రధాని ఫోటో పెట్టాలని అంటున్నారు.ప్రధాని పదవి స్థాయిని దిగజార్చేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రిహరీష్ రావ్ మండిపడ్డారు. బియ్యం అంతా వాళ్లే ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దిగజారేలా మాట్లాడొద్దని మండిపడ్డారు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని గుర్తు చేశారు. కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పోయింది ఎక్కువ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది తక్కువ అని స్పష్టం చేశారు.…