ICC: ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్ ఫోన్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ పేసర్ హారిస్ రౌఫ్ రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, 6 భారత ఫైటర్ జెట్లను కూల్చేసిందనే అర్థం వచ్చేలా హావభావాలను ప్రదర్శించాడు. దీనిపై BCCI అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది.
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్ల మ్యాచ్‌లు పలు వివాదాలకు దారితీస్తున్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో భారత్ ప్లేయర్లు కరచాలనం చేయకపోవడం పెను దుమారం రేపింది. ఆ అవమానాన్ని పాకిస్థాన్ ఆటగాళ్లతో సహా మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా దాయాది దేశాలు గ్రూప్-4లో తలపడగా.. పలుసార్లు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పాక్ సీనియర్ పేసర్ హారిస్ రవూఫ్ ఘటన సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్థాన్ పేసర్ హారిస్…
Pakistan: ఆదివారం ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, ఈ టోర్నీలో పాక్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన ‘6-0’ సంజ్ఞపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, తాము 6 భారత విమానాలను కూల్చేశామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. దీనిపై అక్కడి మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించింది. తమ ఎయిర్ బేస్‌లు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని కూడా…