హరి హర వీరమల్లు సినిమా సెట్స్ మీదకి వెళ్లి చాలాకాలమే అవుతోంది. నిజానికి, భీమ్లా నాయక్ కంటే ముందే ఆ సినిమా షూటింగ్ మొదలైంది. ఆ లెక్క ప్రకారం.. హరి హర వీరమల్లు ఎప్పుడో రిలీజ్ అయిపోవాలి. కానీ, అలా జరగలేదు. మధ్యలో చాలాకాలం గ్యాప్ ఇచ్చారు. దర్శకుడు క్రిష్ ఇటు కొండపొలం, పవన్ అటు భీమ్లా నాయక్ పనుల్లో బిజీ అయిపోయారు. తమతమ పనులు ముగించుకున్న తర్వాతైనా ‘హరి హర వీరమల్లు’ పనుల్ని వేగవంతం చేశారా?…
“ది కాశ్మీర్ ఫైల్స్” మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం హిందీలోనే విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాకు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించగా, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. సినిమా ఊహించని విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం సంతోషంగా ఉంది. అయితే తాజాగా “ది కాశ్మీర్ ఫైల్స్” నిర్మాత అభిషేక్ అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. అసలు…
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం “హరి హర వీరమల్లు”. ప్రస్తుతం పవన్, క్రిష్ ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే క్రిష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రత్యేక ఫోటోను పంచుకున్నారు. ఆ స్పెషల్ ఏంటంటే… సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్, రానా కలిసి నటించిన “భీమ్లా నాయక్” భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఫుల్ ఖుషీ అయిన పవన్ కళ్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా తన ఆగిపోయిన సినిమా ‘సత్యాగ్రహి’ని గుర్తు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాత ఏఎమ్ రత్నం పవన్ కళ్యాణ్ తో ‘సత్యాగ్రహం’ అనే చిత్రాన్ని ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సారథ్యంలో ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం గురించి ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్‌లో ‘సత్యాగ్రహం’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన వేగాన్ని పెంచాడు. ఇప్పటికే పవన్ రీ-ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ‘భీమ్లా నాయక్’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ఎ. ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఎపిక్ అడ్వంచరస్ డ్రామా ‘హరిహర…
పవన్ బర్త్ డే వేడుకలను మరింత ప్రత్యేకం చేయడానికి ఇప్పుడు ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి వంతు వచ్చింది. సురేందర్ రెడ్డి, పవన్ కాంబోలో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సురేందర్ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో “యథా కాలమ్ తథా వ్యవహారమ్…” అంటూ ఒక గన్ ను, హైదరాబాద్ లోని చార్మినార్,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్”తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత పవన్ “హరిహర వీరమల్లు”ను ప్రారంభించారు. అయితే ఈ సినిమా బడ్జెట్, కరోనా వంటి కారణాలతో ఆగిపోయింది. దీంతో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పక్కన పెట్టేసి సాగర్ కే చంద్ర దర్శకత్వంలో “భీమ్లా నాయక్”ను మొదలు పెట్టేశాడు పవన్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తరువాత పవన్, క్రిష్ “హరిహర…