Pawan Kalyan: ఆ రీమేక్ రద్దయ్యిందా..? ఇదిగోండి క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Vinodhaya Sitham Remake Not Shelved: ఈ ఏడాది భీమ్లా నాయక్‌తో అలరించిన పవన్ కళ్యాణ్.. వరుసగా కొన్ని క్రేజీ ప్రాజెక్టులకు లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే! వాటిల్లో రీమేక్స్ కూడా ఉన్నాయి. ఆ రీమేక్స్‌లో వినోదయ సీతమ్ ఒకటి. తమిళంలో ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన సముద్రఖనినే.. తెలుగు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. ఈపాటికే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లాల్సింది. కానీ, అది కుదరలేదు. పైగా, కొంతకాలం నుంచి ఈ సినిమా గురించి ఎలాంటి వార్తలూ రాలేదు. ఈ నేపథ్యంలోనే.. ‘వినోదయ సీతమ్’ రీమేక్ రద్దయ్యిందనే ప్రచారం ఊపందుకుంది. రాజకీయాలతో పాటు ఇతర సినిమాలతోనూ బిజీగా ఉండటంతో, ఆ సినిమాని పవన్ పక్కన పెట్టేశాడన్న రూమర్స్ వచ్చాయి.
అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘వినోదయ సీతమ్’ రీమేక్ రద్దు కాలేదట! ఇది తప్పకుండా రూపొందుతుందని వార్తలొస్తున్నాయి. ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ముగించుకున్న తర్వాత.. అతి తక్కువ కాలంలోనే ఆ సినిమా రీమేక్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడట! అందుకు బల్క్ డేట్స్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. ఆ సినిమా కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సిన అవసరం లేదు. అందుకే, ఒకసారి సెట్స్ మీదకి తీసుకెళ్లాక, పూర్తయ్యేదాకా వేరే ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టకూడదని పవన్ డిసైడ్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. కాగా.. పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా కూడా చేయనున్న సంగతి తెలిసిందే! కాకపోతే, ఇది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్లనుందన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!