ఐపీఎల్ 2025 క్వాలిఫయర్- 2లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉందని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య ప్రశంసించాడు. శ్రేయస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అవకాశాలను సద్వినియోగం చేసుకొని పరుగులు చేశాడన్నాడు. తమ బ్యాటర్లు మంచి స్కోరే చేశారని, బౌలింగ్ యూనిట్ రాణించలేకపోయిందన్నాడు. తమ బౌలర్లు సరైన లెంగ్త్ బౌలింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. సరైన సమయాల్లో జస్ప్రీత్ బుమ్రాను ఉపయోగించుకోలేకపోయాం అని హార్దిక్ తెలిపాడు. క్వాలిఫయర్-…
PBKS vs MI Qualifier 2: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ (MI) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు నేడు (జూన్ 1, ఆదివారం) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడబోతున్నాయి. ముంబైకి ఇది ఆరవ టైటిల్ ఆశతో కూడిన పోరాటం కాగా, పంజాబ్ మాత్రం ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాల్సిందే అంటూ రంగంలోకి దిగుతున్నాయి. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై గుజరాత్ టైటాన్స్‌పై 20 పరుగుల తేడాతో గెలిచి క్వాలిఫయర్…
Always Shubhu Baby: ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మధ్య గ్రౌండ్లో ఉద్రికత్త స్పష్టంగా కనిపించింది. టాస్ దగ్గర నుంచే ఇద్దరి మధ్య బాడీ లాంగ్వేజ్‌లో తేడా కనిపించడంతో పాటు శుభ్‌మన్ ఔట్ అయిన తర్వాత హార్దిక్ తన భావాలను ఆగ్రహంగా వ్యక్తపరిచిన తీరు అభిమానుల్లో అనుమానాలు కలిగించింది. అయితే, మ్యాచ్ అనంతరం గిల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో “నథింగ్ బట్ లవ్”…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) ఈరోజు ముంబై ఇండియన్స్ (MI)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. 5 వికెట్ల నష్టానికి 2228 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అదరగొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఈ సారి ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్, శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్ల మధ్య రేపు హై టెన్షన్ మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. అయితే ఈ రెండు జట్లకు టైటిల్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత రికార్డుల్ని పరిశీలిస్తే ఎలిమినేటర్ ఆడిన జట్టు ఒక్కసారి మాత్రమే టైటిల్ గెలిచింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఘనత సాధించింది.
MI vs DC: నేడు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ ను మొదటగా బ్యాటింగ్ కి ఆహ్వానించింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా ఆడటం లేదు. అతని స్థానంలో ఫాఫ్ డు ప్లెసిస్ టాస్ కోసం వచ్చాడు. ఈ మ్యాచ్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’ లాంటిది. ప్లేఆఫ్స్‌కు నాల్గవ స్థానం కోసం ఇరు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)లో ఈరోజు ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నైని ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన ధోనీ నాయకత్వంలోని సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
సొంతగడ్డపై బంతితో, బ్యాటుతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో గెలిచింది. 163 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడో విజయాన్ని అందుకుని ప్లేఆఫ్స్ రేసులో ఉంది. మరోవైపు ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించిన సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ చేరడం…
ఐపీఎల్ 2025లో 33వ మ్యాచ్ గురువారం ముంబై ఇండియన్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు అలరించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎప్పుడూ ముందుంటుంది. ఆటలో కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చి.. అభిమానులకు ఐపీఎల్ మరింత చేరువవుతోంది. ఈ క్రమంలో ప్రత్యక్ష ప్రసారంలో సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్దమైంది. బ్రాడ్కాస్ట్ టీమ్‌లో సరికొత్త సభ్యుడు ‘రోబో డాగ్’ వచ్చి చేరింది. బ్రాడ్‌కాస్టింగ్ టీమ్‌లో చేరిన రోబో డాగ్‌ను ప్రముఖ కామెంటేటర్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మారిసన్ పరిచయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో…