టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేటితో 37వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అభిమానులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు హిట్‌మ్యాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నారు. “హ్యాపీ బర్త్ డే రోహిత్ శర్మ” అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, వసీం జాఫర్, బీసీసీఐ కార్యదర్శి జై షా ఇలా ఎందరో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలైన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో…