ఒకప్పుడు మాధురీ దీక్షిత్ తెరపై కనిపిస్తే చాలు అయస్కాంతంలా కుర్రకారును ఆకర్షించేది. ఇప్పుడు అభినేత్రిగానూ అదే తీరున మురిపిస్తున్నారు మాధురీ దీక్షిత్. గత సంవత్సరం మాధురి నటించిన ‘మజా మా’ చూసిన వారెవరికైనా ‘ఆంటీ అందం… అదరహో…’ అనిపించక మానదు. నవతరం ప్రేక్షకులు సైతం మాధురి అందాల అభినయానికి ఫిదా అవుతున్నారు. మళ్ళీ మాధురి ఏ సినిమాలో ఎలా నటిస్తుందో చూడాలనీ ఆసక్తితో ఉన్నారు. అందాల మాధురీ దీక్షిత్ ఒకప్పుడు ఎందరో రసికుల స్వప్న సామ్రాజ్యాలకు మహారాణిగా…
ఆ అందాల మెరుపు తీగెను తెరపై చూసి ఎందరో కవితాకన్యకలను తమ మదిలో నాట్యం చేయించారు. ఆ నవ్వులోని తళుకు చూసి ఇంకెందరో కలల సామ్రాజ్యాలను విస్తరించుకున్నారు. తన అందంతో పలువురిని కవులుగా, కలల రాకుమారులుగా మార్చిన ఘనత నాటి మేటి అందాలతార మాధురీ దీక్షిత్ కే దక్కిందని చెప్పవచ్చు. ఆ తరం నాయికల్లో తనదైన అందాల అభినయంతో మాధురీ దీక్షిత్ సాగిన తీరును ఎవరూ మరచిపోలేరు. ‘మాధురీ దీక్షిత్’ అన్న పేరు గుర్తు చేసుకుంటే చాలు…