Warangal-Karimnagar:ఓరుగల్లు మహానగర ప్రజలకు వరద ముప్పు నుంచి విముక్తి కల్పించే పనులు ప్రారంభమయ్యాయి. వరదలకు ప్రధాన కారణమైన నయీంనగర్ కెనాల్ విస్తరణ, వంతెన పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన బైక్ ఎక్కుతున్న ఓ మహిళని అతి వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. అప్పుడే కాజీపేట సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ నుండి బయటికి వచ్చి బైక్ ఎక్కుతున్న క్రమంలో కవిత అనే మహిళను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతుగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ రాష్ట్రానికి చేరుకున్న ఆయన హనుమకొండ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ మండల కేంద్రంలో జరిగని సభలో ఆయన ప్రసంగించారు. సభలో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ విలీనం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని పేర్కొన్నారు.…
వరంగల్, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న ఆమె.. శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమకొండలోని హంటర్ రోడ్డులో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్, ఎన్ఎన్ నగర్ ప్రాంతాల్లో బాధితులను ఆమె పరామర్శించారు.
Manhole: హన్మకొండ పరిధిలోని కొత్తూరు జెండా ప్రాంతంలో మురుగునీటిని తొలగించే క్రమంలో మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసిన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఒక సిబ్బంది మ్యాన్‌హోల్ క్లీన్ చేసేందుకు అందులో దిగి శుభ్రం చేశాడు.
కోవిడ్ మహ్మరి కారణంగా టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులను అందరికి వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. అత్తింటి పోరు తట్టుకోలేక పోతున్నా అంటూ హైదరాబాద్‌లో కాపురం పెడతామంటూ రోజూ భర్తను వేధించేది భార్య. అత్తమామలు కూడా ఆభర్తకు వేధింపులు ఎదురయ్యాయి. అయినా కూడా భర్త, భార్యను సహిస్తూ వచ్చాడు. తను గర్భవతి కావడంతో.. ప్రతీదీ సహిస్తూ భరించాడు. తన భార్య ఐదు నెలల గర్భవతి కావడంతో.. తన పుట్టింటికి వెళ్లింది. భార్య కు కాల్ చేసాడు భర్త. వీడియో…
నగరంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉక్కపోతతో భాగ్యనగర వాసులు అల్లాడుతున్నారు. గరిష్టంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత.. కనిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఎండల తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి సిటీ ప్రజలు జంకుతున్నారు. భానుడి భగభగలతో నగరంలోని రోడ్లు బోసిపోతున్నాయి. రోజుకు సగటున 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి నగరంలో ఎండల తీవ్రత…