Israel-Hamas War: టెల్ అవీవ్ టార్గెట్‌గా ఇజ్రాయిల్‌పై హమాస్ భారీ క్షిపణి దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై భారీగా మిస్సైల్ దాడికి పాల్పడ్డారు. హమాస్ సాయుధ విభాగం అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ఆదివారం ఇజ్రాయిల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా క్షిపణి దాడి ప్రారంభించింది. ఇజ్రాయిల్ సైన్యం సెంట్రల్ సిటీలోని సైరన్‌లను మోగించింది, రాకెట్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం తన టెలిగ్రామ్ ఛానెల్‌లో అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో.. ‘‘పౌరులపై జియోనిస్ట్(ఇజ్రాయిల్) చేస్తున్న మారణకాండకు ప్రతిస్పందగా రాకెట్‌లను ప్రయోగించాము’’ అని చెప్పారు.
Read Also: Cyclone Remal: తీవ్ర తుఫానుగా మారిన ‘రెమల్’.. బంగ్లాదేశ్, బెంగాల్ తీరాన్ని తాకనున్న తుఫాన్
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లు ప్రయోగించినట్లు హమాస్ అల్ అక్సా టీవీ తెలిపింది. గత నాలుగు నెలలుగా టెల్ అవీవ్‌లో రాకెట్ సైరన్లు వినిపించలేదు, అయితే సైరన్‌లకు గల కారణాన్ని ఇజ్రాయిల్ సైన్యం వెంటనే వెల్లడించలేదు. ఇజ్రాయెల్ అత్యవసర వైద్య సేవలు, తమకు ఎలాంటి ప్రాణనష్టం గురించి నివేదికలు అందలేదని చెప్పింది. దక్షిణ గాజాలోని రఫా ప్రాంతం నుంచి హమాస్ కనీసం ఎనిమిది రాకెట్లను ప్రయోగించగా, అనేక రాకెట్లను ఇజ్రాయిల్ సైన్యం అడ్డగించిందని బీబీసీ తెలిపింది. హెర్జ్లియా, పెటా టిక్వాతో సహా వివిధ నగరాల్లో, పట్టణాల్లో సైరన్లు మోగినట్లు నివేదికలు వెల్లడించాయి.
గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హతమార్చడమే కాకుండా 240 మంది బందీలుగా గాజాలోకి తీసుకెళ్లి యుద్ధానికి ఆజ్యం పోశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ హమాస్ మిలిటెంట్లు, వారి స్థావరాలే లక్ష్యంగా భీకరదాడులు చేస్తోంది. ఇప్పటికే గాజా నగరం సర్వనాశనం అయింది. మరోవైపు ఈజిప్టు-గాజా సరిహద్దుల్లోని రఫాను స్వాధీనం చేసుకునే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఈ ప్రాంతంలోని హమాస్ మిలిటెంట్లను నిర్మూలించడమే లక్ష్యంగా పేర్కొంది. ఈ యుద్ధం వల్ల అమాయకమైన పాలస్తీనా పౌరులు 36,000 మంది మరణించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!