S. Jaishankar: పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సమయంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. గాజా సమస్యకు ‘ద్విదేశ’ పరిష్కారానికి తాము మద్దతు ఇస్తామని తెలిపారు.
హమాస్ ఉగ్రవాద సంస్థకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించ ముందే.. హమాస్ తన వద్ద బందీలుగా ఉంచుకున్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దురాగతాలకు పాల్పడే వారికి నరకం చూపిస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్ ట్రూత్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘అమెరికా అధ్యక్షుడిగా 20 జనవరి 2025న…
PM Modi Letter To Palestine: పాలస్తీనా ప్రజలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లేఖ రాశారు. పాలస్తీనా అభివృద్ధికి తాము మద్దతుగా ఉంటుందని తెలిపారు. పాలస్తీనాలో కొనసాగుతున్న ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు.
Israel–Hamas war: ఈజిప్టు రాజధాని కైరోలో ఈ రోజు (నవంబర్30) ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై నిర్వహించే చర్చలకు తమ ప్రతినిధులు హాజరవుతారని హమాస్ గ్రూప్ తెలిపింది.
Israel: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, మాజీ రక్షణశాఖ మంత్రి యోవ్ గల్లాంట్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈక్రమంలోనే ఆ అరెస్టు వారెంట్‌ను క్యాన్సిల్ చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ మహిళా బందీ హతమైంది. ఈ మేరకు శనివారం హమాస్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడి చేసిన ఉత్తర గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ మహిళా బందీని హమాస్ హతమార్చింది. హమాస్ సాయుధ విభాగం ప్రతినిధి శనివారం తెలిపారు. ఇది కూడా చదవండి: Nagarjuna: ఏఎన్నార్ బయోపిక్ కష్టం.. నాగ్ కీలక వ్యాఖ్యలు అక్టోబర్ 7, 2023లో హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైంది. హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి కొందరిని బందీలుగా తీసుకుపోయారు. ఆ రోజు ఇజ్రాయెల్…
Isaral-Hamas War: ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ గాజాలోని హమాస్‌పై విరుచుకుపడుతోంది. హమాస్ కీలక నేతల్ని ఒక్కొక్కరిగా మట్టుపెడుతోంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మంగళవారం పాలస్తీనా ప్రాంతమైన గాజాలో పర్యటించారు. గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ ప్రాంతానికి నెతన్యాహూ వెల్లడం ఇదే మొదటిసారి.
ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. అక్టోబర్ చివరిలో అకస్మా్త్తుగా ఇరాన్ అణు స్థావరాలపై ఐడీఎఫ్ దళాలు దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా ఇరాన్ ఉలిక్కిపడింది.
గాజాపై ఇజ్రాయెల్ జరిపిస్తున్న మారణహోమానికి ప్రతీకారంగానే అమ్‌స్టర్‌డామ్‌లో ఇజ్రాయెల్ పౌరులపై దాడి జరిగిందని హమాస్ మిలిటెంట్ గ్రూప్ నేత సమీ అబు జుహ్రీ పేర్కొన్నాడు.