గాజాలో కరవు విలయతాండవం చేస్తోంది. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. భవంతులు కుప్పకూలాయి. ఆహార ఉత్పత్తులు అడుగంటాయి. స్వచ్ఛంద సంస్థల సహాయాలు నిలిచిపోయాయి. దీంతో కరవు మరింత దుర్భిక్షంగా మారింది.
Trump Effect: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు హమాస్ ఉగ్రవాదం సంస్థలకు మద్దతుగా వ్యవహరిస్తూ, హమాస్ నాయకులకు ఆశ్రయం ఇస్తున్న ఖతార్ తన వైఖరిని మార్చుకుంది. దోహాలో నివసిస్తున్న హమాస్ లీడర్లను బహిష్కరించేందుకు ఖతార్ అంగీకరించింది. అమెరికా నుంచి నుంచి వచ్చిన ఒత్తిడి తర్వాత ఖతార్ ఈ నిర్ణయం తీసుకుంది.
హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. హమాస్ అగ్ర నాయకులందరినీ అంతమొందించింది. ఇక గాజా పట్టణాన్ని ఐడీఎఫ్ సర్వనాశనం చేసింది. అయితే చాలా దినాలుగా యుద్ధం జరుగుతుండడంతో గాజాలోని సామాన్య ప్రజలు తిండి లేక నానా యాతన పడుతున్నారు.
Israel PM: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవి నుంచి తొలగించారు.
Gaza-Israel War: హమాస్, హెజ్బొల్లా గ్రూప్‌లను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వాన్ని.. గాజా కీలక దస్త్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తోంది. ప్రధాని సన్నిహితులే ఈ రహస్య సమాచారం లీక్ చేశారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దేశ భద్రతాపరమైన అత్యంత రహస్య సమాచారాన్ని పీఎంఓలో పనిచేస్తోన్న అధికారిక ప్రతినిధి ఎలిఫెల్డ్‌స్టెయిన్ చేరవేశారని పేర్కొన్నాయి. భద్రతా సంస్థల్లో పనిచేస్తోన్న మరో ముగ్గురికి కూడా దీనితో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. అయితే వారి పేర్లు మాత్రం…
Israel–Hamas war: హమాస్ ఉగ్రవాద సంస్థలో మిగిలిన చివరి కీలక నేతను చంపేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. హమాస్ పొలిట్‌బ్యూరో సభ్యుడైన కసబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ పేర్కొనింది.
Israel-Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు హెచ్చరికగా యూఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం నుంచి మరింత సైనిక సామగ్రిని ఇజ్రాయెల్ కు తరలిస్తున్నట్లు పేర్కొంది.
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రసంగాన్ని హమాస్ ఉగ్రదాడిలో బాధితులుగా ఉన్న ప్రజలు అడ్డుకున్నారు. అక్టోబర్ 07 నాటి జరిగిన దాడి సంస్మరణ సభ సందర్భంగా నెతన్యాహూ స్పీచ్‌కి అంతరాయం కలిగించారు. నెతన్యాహూ ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నంత సేపు మౌనంగా కదలకుండా నిలబడి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. Read Also: AP: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన IASలకు పోస్టింగులు.. ఆమ్రపాలి పోస్ట్ ఇదే ‘‘నా తండ్రి…
Israel-Hamas: ఇజ్రాయెల్, హమాస్‌ల సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి.