సీనియర్ జర్నలిస్ట్, మ్యూజికాలజిస్ట్, ‘హాసం’ పత్రిక సంపాదకులుగా వ్యవహరించిన శ్రీ రాజా హైదరాబాద్ లో గురువారం మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని నెలలుగా ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ‘వార్త’ దిన పత్రిక సినిమా పేజీ ఇన్ ఛార్జ్ గా, ‘హాసం’ పక్షపత్రిక సంపాదకుడిగా పనిచేసిన, శ్రీ రాజా ‘మాటీవీ’ సినిమా విభాగంలో తన సేవలు అందించారు. రేడియో మిర్చి అవార్డుల కమిటీలోనూ పలు సంవత్సరాల పాటు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అత్యంత పాఠకాదరణ…