Usha Lakshmi: ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కొత్త ఉషాలక్ష్మి కన్నుమూశారు. గుండెపోటుతో మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారని వారి కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె వయసు 91 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన డాక్టర్ ఉషాలక్ష్మి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరొందిన గైనకాలజిస్టుల్లో ఒకరు. ఆవిడ గైనకాలజీ ప్రొఫెసర్‌గా హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో సుదీర్ఘకాలం సేవలందించారు. అయితే ఆమెకు 69 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఉషాలక్ష్మి ఆ వ్యాధికి ఎదిరించి ధైర్యంగా నిలబడ్డారు.…