తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తెలంగాణలో పలు జిల్లాల్లో వరదలు సంభవించాయి. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వరదలు భీభత్సం సృష్టించాయి. వరంగల్ జిల్లాలోని పలు లింక్ రోడ్లు వరదల ధాటికి తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా.. శిథిలావస్థకు చేరుకున్న కొన్ని భవనాలు సైతం వరదల దెబ్బకు నేలకూలాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే పాతభవనాలను కూల్చివేసేందుకు పూనుకుంది అధికార యంత్రాంగం. అయితే.. ఈ క్రమంలోనే గ్రేటర్ వరంగల్ మన్సిపల్ కార్పొరేషన్ పాల…