ఏపీ ఫైబర్ నెట్ ఎండీ, ఈడీ, అధికారులపై ఛైర్మన్ జీవీ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫైబర్ నెట్ అధికారుల్లో లెక్కలేనితనం, ఒళ్లు బద్ధకం కనిపిస్తున్నాయని మండిపడ్డారు. కోర్టు వాయిదాలకు వెళ్లకుండా రూ.337 కోట్ల పెనాల్టీ పడేలా చేశారన్నారు. తనకు అకౌంట్స్ బుక్స్ ఇవ్వడం లేదని, అధికారులు ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. బిజినెస్ చేయకపోగా ఉన్నదాన్ని పోగొడుతున్నారని, ఫైబర్ నెట్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారని జీవీ రెడ్డి పేర్కొన్నారు. ఫైబర్ నెట్ కార్యాలయంలో నిర్వహించి మీడియా…
ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు ఉండటంతో కార్పొరేషన్‌లో 410 మంది ఉద్యోగులను తొలగించే విధంగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫైబర్ నెట్‌లో 410 మంది ఉద్యోగులను తొలగించటానికి నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.