Oil Discovery: ముడి చమురు దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. ఆయిల్ దిగుమతుల్లో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలో భారత్ ఉంది. ముఖ్యంగా దేశీయ అవసరాల కోసం 85 శాతం ఆయిల్‌ని మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు చూస్తే భారత్ జాక్‌పాట్ కొట్టినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 16న నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. తొలుత ప్రధాని మోడీ నైజీరియాలో పర్యటించారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ గయానా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇండియా-కరేబియన్ కమ్యూనిటీ సమ్మిట్‌కు సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నైజీరియా, బ్రెజిల్, గయానాలలో తన ఐదు రోజుల మూడు దేశాల పర్యటన ముగిసింది. దింతో ఆయన గురువారం ఆయన గయానా నుండి బయలుదేరుతున్నట్లు ప్రకటిస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. Also Read: Etela Rajender : మత్స్యకారులను రాజకీయంగా…
ప్రధాని మోడీ గయానాలో పర్యటిస్తున్నారు. గయానా రాజధాని జార్జ్‌టౌన్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోడీకి విమానాశ్రయంలో రాష్ట్రపతి ఇర్ఫాన్ అలీ, ప్రధానమంత్రి మార్క్ ఆంథోనీ ఫిలిప్స్, సీనియర్ మంత్రులు, ఇతర ప్రముఖులు ఘనస్వాగతం పలికారు.
PM Modi: 3 దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలుత నైజీరియా చేరుకున్నారు. ఈ సందర్బంగా మోడీకి ఘన స్వాగతం పలికారు. నైజీరియాలో ఉన్న ప్రవాస భారతీయులు మోడీకి స్వాగతం పలికారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ బ్రెజిల్‌లో జరిగే జీ-20 సమ్మిట్ కోసం బయలుదేరారు. బ్రెజిల్ సహా గయానా, నైజీరియా దేశాల్లో పర్యటించనున్నారు. గతేడాది జీ-20 సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నైజీరియాలోలో పర్యటించబోతున్నారు.
ప్రధాని మోడీ మరోసారి మూడు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. నవంబర్ 16-21 తేదీల్లో నైజీరియా, బ్రెజిల్, గయానాలో పర్యటించనున్నారు. గతనెల అక్టోబర్‌లో మోడీ రష్యాకు వెళ్లి వచ్చారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్నారు. మరోసారి ఒకేసారి మూడు దేశాల్లో పర్యటించనున్నారు. 17 సంవత్సరాల్లో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా.. కాసేపట్లో ఇండియా-ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ జరుగనుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్.. గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. రాత్రి 7.30 గంటలకు టాస్ జరిగి.. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం పడటంతో ఆలస్యమైంది.
కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీ ఫైనల్లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జరగనున్న గయానా స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. టాస్ కు ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే అప్పటివరకు వాన తగ్గుతుందా..? లేదా అనేది ఉత్కంఠగా మారింది. కాగా.. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. వర్షం పడితే అదనంగా మరో 250 నిమిషాల సమయం కేటాయించానున్నారు. లేదంటే..…
India vs England Weather Report in Guyana: టీ20 ప్రపంచకప్ 2024 మొదటి సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి భారత్-ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్ మీదే ఉంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ గురువారం రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ ఆసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం గండం పొంచి ఉండటం…