IND vs ENG: భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్.. లేటెస్ట్ వెదర్ అప్‌డేట్ ఇదే!
- భారత్-ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్
- రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం
- లేటెస్ట్ వెదర్ అప్‌డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs England Weather Report in Guyana: టీ20 ప్రపంచకప్ 2024 మొదటి సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి భారత్-ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్ మీదే ఉంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ గురువారం రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ ఆసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం గండం పొంచి ఉండటం మరింత ఉత్కంఠ రేపుతోంది.
ప్రస్తుతం గయానాలో వాతావరణం పొడిగానే ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే భారత్-ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి చిరుజల్లులు పడే అవకాశాలు ఉన్నాయట. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తాజాగా వెల్లడించింది. రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్‌డే లేనందున ఇరు జట్ల ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Anant Ambani Wedding: స్టార్ హీరోల ఇంటికి అనంత్ అంబానీ.. పెళ్లికి రావాలంటూ ప్రత్యేక ఆహ్వానం!
భారత్-ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్‌డే లేకున్నా.. అదనంగా 250 నిమిషాల సమయం కేటాయించారు. ఈ లోగా మ్యాచ్ పూర్తవ్వాలి. వర్షం కారణంగా ఆటంకం కలిగితే.. కుదించిన ఓవర్లతో మ్యాచ్ సాగనుంది. రెండు జట్లూ కనీసం 10 ఓవర్ల చొప్పున ఆడితేనే.. ఫలితాన్ని ప్రకటిస్తారు. అలా జరగని పక్షంలో మ్యాచ్ రద్దవుతుంది. మ్యాచ్ రద్దయితే భారత్ ఫైనల్‌కు చేరుతుంది. సూపర్-8లో భారత్ గ్రూప్-1లో అగ్రస్థానంలో ఉండడమే కారణం. చూడాలి మరి నేడు వరణుడు కరుణిస్తాడో లేదో.
తాజావార్తలు
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!