అమ్‌చాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి వచ్చిన అడవి ఏనుగు అస్సాం రాజధాని గౌహతిలోని నారంగి ఆర్మీ కాంట్‌లోని పిల్లల పార్కులో ఉన్న ఆట వస్తువులతో సరదాగా ఆడుతూ కనిపించింది.
ఈశాన్య భారతం వరదల, భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ముఖ్యంగా అస్సాం, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియాలు విరగిపడ్డాయి. ముఖ్యంగా అస్సాంలోని 28 జిల్లాల్లో 20 లక్షలకు పైగా ప్రజలు వరదలకు ప్రభావితం అయ్యారు. 150 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి 40కి పైగా సైనికులు, ప్రజలు చనిపోయారు. ఇక అన్ని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు వణికించాయి.…
ఈశాన్య రాష్ట్రాలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. అస్సాంలో వరదల వల్ల ఇప్పటి వరకు 54 లక్షల మంది ప్రభావితం అయ్యారు. తాజాగా గురువారం వరదల కారణంగా మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో కురుస్తున్న వర్షాల కారణంగా పరిస్థితులు భయంకరంగా మారాయి. చాలా జిల్లాలు వరద తాకిడికి గురయ్యాయి. మొత్తం 36 జిల్లాల్లో 32 జిల్లాలు ముంపుకు గురయ్యాయి. వరదల వల్ల ఇప్పటి వరకు అస్సాంలో…